Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ...

తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆగ్రహించిన కుమార్తె ఆ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకుంది. తన స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని కడతేర్చింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో జరిగిన ఈ వివరాలను పరిశీ

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (14:11 IST)
తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆగ్రహించిన కుమార్తె ఆ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకుంది. తన స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని కడతేర్చింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఎల్‌ఐజీ కాలనీలోని స్థిరాస్తి వ్యాపారి దుర్గాదాస్‌(47) ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆమె ఇంటికి అపుడపుడూ వస్తూపోతూవుండేవాడు. ఈ విషయం డిగ్రీ చదువుతున్న ఆ మహిళ కుమార్తెకు తెలిసి, ఇది మంచి పద్దతికాదంటూ ఇద్దరినీ వారించింది. అయినప్పటికీ వారి వైఖరిలో ఎలాంటి మార్పురాలేదు. 
 
దీంతో తమ పరువుకు భంగం కలుగుతోందని ఆమె తన స్నేహితుల వద్ద వాపోయింది. అంతటితో ఆగకుండా దుర్గాదాస్‌పై కక్ష పెంచుకొని మట్టుపెట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం స్టీఫెన్‌, అంటోని రాబెన్, శ్రీదీప్‌ సుందర్‌ అనే స్నేహితుల సహకారం కోరింది. దీనికి ఆ ముగ్గురు సమ్మతించడంతో పథకం ప్రకారం దాడి చేయింది. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దుర్గాదాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తన భర్త మృతిపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూసింది. కారు నంబరు ఆధారంగా ముగ్గురు యువకులను అరెస్టు చేయగా, హత్యకు ప్రేరేపించిన యువతి పరారీలో ఉంది. ఆమె కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments