Webdunia - Bharat's app for daily news and videos

Install App

పానీ పూరీ తినేందుకు వెళ్లి మృత్యువాతపడ్డారు... ఎలా?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:45 IST)
పానీ పూరీ ఆరగించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్.ఐ నాగేశ్వర రావు వెల్లడించిన వివరాలమేరకు... హైదరాబాద్ తుక్కుగూడ గ్రామానికి చెందిన కట్టెల శ్రీనివాస్ ‌(28) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ పేట్రోల్ బంగులో పని చేస్తున్నాడు. 
 
అయితే, ఈయనకు పానీపురీ తినాలని ఆశ కలిగింది. దీంతో అతను స్థానిక సిండికేట్‌ బ్యాంక్‌ సమీపంలోని పానీపూరీ బండి వద్దకు వెళ్లి పానీపూరి ఇవ్వాలని యజమాని బాబూరావును కోరాడు. 
 
తానీ, శ్రీనివాస్‌కు బాబూరావు పానీపూరి ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇదే విషయంపై వారిద్ధరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో కోపం పట్టలేక పానీపూరీ బండి అద్దంపై శ్రీనివాస్ బలంగా కొట్టాడు. అతని దెబ్బకు అద్దం పగిలి మోచేతికి గుచ్చుకుంది. 
 
పైగా, శ్రీనివాస్ మోచేయి నరం తెగిపోవడంతో తీవ్ర  రక్తస్రావమైంది. దీన్ని గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కాగా అతడి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ అతడి సోదరుడు గణేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments