Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ ట్రస్టులకు తితిదే నిధులా? హైకోర్టు సీరియస్.. ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ

హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానం రూ.50లక్షల రూపాయలు, దేవాదాయ శాఖ నుంచి రూ.50లక్షలు కేటాయించాలనే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్పందించింది. నిధులను ప్రై

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (11:06 IST)
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానం రూ.50లక్షల రూపాయలు, దేవాదాయ శాఖ నుంచి రూ.50లక్షలు కేటాయించాలనే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్పందించింది. నిధులను ప్రైవేట్ ట్రస్టులకు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. చట్టవిరుద్ధమైన నిర్ణయమని ఆక్షేపిస్తూ నిధుల విడుదల ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
 
మరోవైపు తితిదే నిధుల కేటాయింపు వివాదాస్పదమైంది. ధర్మ ప్రచారం పేరుతో ఏటా దాదాపు కోట్లాది రూపాయలను కేటాయిస్తోంది. హిందూ ప్రచార ధర్మ పరిషత్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న టీటీడీ, ప్రైవేటు ట్రస్టులకు కోట్లాది రూపాయలు కేటాయించడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనివల్ల ఏటా కోట్లాది రూపాయలు ప్రైవేటు ట్రస్టులకు కేటాయించడాన్ని తప్పుబట్టి నిరసనలు చేపట్టారు. 
 
ఈ నిధుల కేటాయింపును వ్యతిరేకిస్తూ తిరుపతికి చెందిన నవీన్‌కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పూర్తి వివరాలు సమర్పించాలంటూ ఏపీ రెవిన్యూ ముఖ్య కార్యదర్శికి, దేవాదాయ శాఖ కమిషనర్‌కు, టీటీడీ ఈవోతోపాటు హిందూ పరిరక్షణ ట్రస్టు ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: పవన్ గొప్ప మనసున్న వ్యక్తి... ఆయనతో కలిసి నటించడం అదృష్టం

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ (video)

అల్లు అర్జున్ కు దిష్టి తీసిన కుటుంబసభ్యులు - అండగా వున్నవారికి థ్యాంక్స్

సూర్య 45 లో, RJ బాలాజీ చిత్రంలో హీరోయిన్ గా త్రిష ఎంపిక

చియాన్ విక్రమ్, మడోన్ అశ్విన్, అరుణ్ విశ్వ కాంబినేషన్ లో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments