Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను తిరస్కరించిందనీ ప్రియురాలు.. ఆమె తల్లిపై దాడి... ఆపై సూసైడ్

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (10:09 IST)
తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో యువతితో పాటు.. ఆమె తల్లిపై కూడా ఓ ప్రేమోన్మాది కత్తితో దాడిచేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వైజాగ్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి (31) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని స్రవంతి నగర్‌లోని ఓ ఇంటిలో అద్దెకు నివశిస్తున్నాడు. అదే ప్రాంతంలో తన తల్లి సుజాతతో కలిసి తమిళనాడుకు చెందిన సౌజన్య (26) నివాసముంటోంది. శ్రీనివాస రెడ్డి, సౌజన్య ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో సౌజన్యపై శ్రీనివాస రెడ్డి మనసుపడింది. దీంతో గత కొంతకాలంగా ప్రేమిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. 
 
ఈ విషయాన్ని సౌజన్య దృష్టికి తీసుకెళ్లగా ఆమె.. శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనను తిరస్కరించింది. దీన్ని జీర్ణించుకోలేక పోయిన శ్రీనివాస రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ, ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో స్క్రూ డ్రైవర్ జేబులో పెట్టుకుని సౌజన్య ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సౌజన్య ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లికి విషయం చెప్పి తన ప్రేమకు అడ్డురావొద్దని హెచ్చరించాడు. 
 
అయితే, అందుకు ఆమె అభ్యంతరం చెప్పి, తన కూతురును ప్రశాంతంగా బతకనివ్వాలని సుజాత వేడుకుంది. దీంతో తమ ప్రేమకు ఆమె అడ్డు వస్తోందని భావించిన శ్రీనివాస రెడ్డి స్క్రూ డ్రైవర్‌తో ఆమెపై దాడి చేశాడు. అదేసమయంలో ఇంటికి వచ్చిన సౌజన్య... తల్లిపై జరుగుతున్న దాడిని అడ్డుకుంది. దీంతో రెచ్చిపోయిన శ్రీనివాస రెడ్డి ఆమెను కూడా గాయపరిచాడు.
 
తల్లీకూతుళ్ల అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చేసరికి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే సౌజన్య, ఆమె తల్లిని స్థానికులు  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దాడి చేసిన వెంటనే శ్రీనివాసరెడ్డి సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments