Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు... తప్పిన పెను ముప్పు

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (19:08 IST)
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని ఆరో నంబరు ఫ్లాట్‌ఫాంపై నిలిపివున్న సమయంలో బోగీలో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించాయి. ఫలితంగా పెను ప్రమాదం తప్పింది. 
 
రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్‌ 6లో నిలిచివున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 
 
హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపు చేశారు. నిలిచి ఉన్న రైలు కావడం.. ప్రయాణికులెవరూ అందులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం జరిగింది. దీంతో ఈ ఎక్స్‌ప్రెస్ రైలు హైదరాబాద్ నుంచి ఆలస్యంగా బయలుదేరింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments