Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిదశ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం : ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ ఫైట్

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:42 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 91 లోక్‌సభ స్థానాలకు ఈనెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా ఓటింగ్ జరుగనుంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వీటిన్నింటికీ కలిపి ఒకేసారి పోలింగ్ జరుపనున్నారు. 
 
దేశంలో జరిగే తొలిదశలో 91 స్థానాలకు జరిగే ఎన్నికల పోలింగ్‌లో 1,280 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్లకు  319 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే, 175 అసెంబ్లీ సీట్లకు 2,118 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఏపీలో మొత్తం 3,92,45,717 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 45,920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో 9 వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ సీట్లకు 445 మంది పోటీ పడుతుండగా, అత్యధికంగా నిజామాబాద్ స్థానానికి ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 2,96,97,279 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 34,094 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, 17 లోక్‌సభ సీట్లలో 13 సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. నిజామాబాద్ స్థానంలో మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మిగిలిన 7 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments