Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది.. భర్త ఎలా కనుగొన్నాడో తెలుసా?

ఆధునికత పెరుగుతున్న కొద్దీ.. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో ఒకరినొకరు మోసం చేసుకునే దంపతుల సంఖ్య పెరగిపోతుంది. దీంతో నేరాలు కూడా పెరుగుతున్

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (12:50 IST)
ఆధునికత పెరుగుతున్న కొద్దీ.. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో ఒకరినొకరు మోసం చేసుకునే దంపతుల సంఖ్య పెరగిపోతుంది. దీంతో నేరాలు కూడా పెరుగుతున్నాయి.


తాజాగా తనకన్నా పదేళ్లు చిన్నవాడైన అవివాహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ప్రియుడితో కలసి గోవాకు వెళ్లగా, జీపీఎస్ సాయంతో ఆమె భర్త గుర్తించాడు. అంతటితో ఆగకుండా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి తరచూ క్యాంపుల నిమిత్తం బయటి ప్రాంతాలకు వెళ్తుండేవాడు. అతని వ్యాపారాలను భార్య చూసేది. ఈ క్రమంలో కారును వాషింగ్‌కు తీసుకెళ్లిన ఆమెకు షాపు యజమాని మాధవ్ పరిచయం అయ్యాడు. తనకన్నా పదేళ్లు చిన్నవాడైన మాధవ్‌తో ఆమె వివాహేతర బంధం ఏర్పడింది. వీరిద్దరూ ఇంట్లో రహస్యంగా కలవడం చూసిన భర్త ఆమెను హెచ్చరించాడు. ఆ సమయంలో క్షమించమని కోరిన భార్య.. పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి.. ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. 
 
అనుమానం వచ్చిన భర్త, ఆమె కారులో జీపీఎస్ పరికరాన్ని అమర్చాడు. వారు ఎక్కడున్నారో కనుగొన్నాడు. దీంతో భార్యతో వివాహేతర సంబంధం కొనసాగించిన వ్యాపారి, భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకా భార్య వద్ద తన కుమార్తెలను వుంచకూడదని.. తనకు అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments