Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మార్వో హత్య - నిందితుడు మృతి.. మొబైల్ కాల్ డేటా ఆధారంగా..?

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (11:51 IST)
అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డి హత్యచేయడానికి నిందితుడిని ఎవరైనా ప్రోత్సహించారా? ఎవరున్నారు? అనేది తెలుసుకోవడం మరింత జటిలమైంది. నిందితుడి మొబైల్ కీలకంగా మారడంతో కాల్‌డేటా ఆధారంగా మరికొందర్ని ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు.

నవంబరు 4న ఘటన జరిగిన తర్వాత 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియాలో చేరిన సురేష్ కొద్ది గంటల వరకు డాక్టర్లతో మాట్లాడాడు. అతడి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ రికార్డ్ చేసే సమయానికి పోలీసులు అక్కడ లేరు.
 
అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేశ్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో హత్య కేసు మిస్టరీ పోలీసులకు మరింత సవాల్‌గా మారింది.  
 
భూ సమస్య పరిష్కారం కాకపోవడంతోనే తీవ్ర ఆవేదన చెందిన సురేష్.. ఈ ఘటనకు పాల్పడినట్లు అతని మాటలను బట్టి అర్థమైందని ఉస్మానియా వైద్యులు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. నిందితుడు సురేష్‌ చనిపోయినా కేసు దర్యాప్తు కొనసాగుతుందని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ స్పష్టం చేశారు. సురేశ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని అందజేయాలని మేజిస్ట్రేట్‌ను పోలీసులు కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments