Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్లు కొనిస్తానని బైక్‌పై ఎక్కించుకున్నాడు... నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ చేశాడు!

హైదరాబాద్ సమీపంలోని మన్సూరాబాద్‌లో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. వీధిలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ళ బాలికకు చాక్లెట్లు కొనిస్తానని నమ్మించిన ఓ కామాంధుడు.. బైక్‌పై ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (16:37 IST)
హైదరాబాద్ సమీపంలోని మన్సూరాబాద్‌లో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. వీధిలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ళ బాలికకు చాక్లెట్లు కొనిస్తానని నమ్మించిన ఓ కామాంధుడు.. బైక్‌పై ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మన్సూరాబాద్‌‌లోని ఓ బస్తీ ప్రాంతంలో నివశించే రాకేష్‌ రెడ్డి (19) బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కూలిపనికెళ్లిన తల్లి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో కూతురు కనిపించకపోవడంతో పరిసరాల్లో తల్లిదండ్రులు గాలించారు.
 
అయితే, ఆ బాలికను రాకేష్ రెడ్డి బైకుపై తీసుకెళ్లడాన్ని తోటి చిన్నారులు చూశారు. ఇంతలో బాలికను రాకేష్ బైక్‌పై తీసు కొచ్చాడు. ఎక్కడికి తీసుకెళ్లావని బాలిక తల్లిదండ్రులు అడగితే బైక్‌ విడిచిపెట్టి పారిపోయాడు.
 
ఏం జరిగిందని కూతురిని తల్లిదండ్రులు అడగగా.. చెట్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చెప్పింది. అదేరోజు రాత్రి వారు ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని ఫోక్సో, నిర్భయ కేసులు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments