Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారి కూడా కోర్కె తీర్చలేదు.. ఆయన నపుంసకుడు.. విడాకులు కావాలి...

తన భర్త నపుంసకుడని, అతనితో కాపురం చేయలేనని, అందువల్ల తనకు విడాకులు ఇప్పించాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. కర్నాటక రాష్ట్రంలోని షిమోగాకు చెందిన ఈ మహిళ భర్త వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేయడమే

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (16:09 IST)
తన భర్త నపుంసకుడని, అతనితో కాపురం చేయలేనని, అందువల్ల తనకు విడాకులు ఇప్పించాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. కర్నాటక రాష్ట్రంలోని షిమోగాకు చెందిన ఈ మహిళ భర్త వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
‘మా వివాహం జరిగి రెండేళ్ళు కావస్తోంది. షిమోగా జిల్లాలో మా పెళ్ళి జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నాతో సంసారం చేయనేలేదు. తీరా ఆయన సంసారానికి పనికిరాడని నపుంసకుడని తేలింది. ఈ మహానుభావుడితో ఇక కాపురం చేయలేను. విడాకులు ఇప్పించండి మహా ప్రభో..’ అంటూ బెంగుళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 
 
ఇలా కేసు దాఖలు చేసిందో లేదో భర్త ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం ప్రారంభించాడు. కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఆమె ఆర్‌.టి. నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విచిత్రమైన కేసును నమోదు చేసుకున్న పోలీసులు దంపతులిద్దరిని స్టేషనకు పిలిపించి కౌన్సిలింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. యువతి నుంచి ఫిర్యాదు స్వీకరించినప్పటికీ ఆమె పేరును, ఇతర వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments