Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టం లేకున్నా పెళ్లి చేస్తున్నారనీ...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (11:39 IST)
హైదరాబాద్ నగరంలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేస్తుండటంతో ఈ దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని సింగాడబస్తీలో నివాసం ఉంటున్న అలీముద్దీన్ అనే వ్యక్తి కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు తహసీన్‌ బేగం (18) అనే కుమార్తె, అరిఫ్ (11) అనే కుమారుడు ఉన్నాడు. తహసీన్ బేగం తొమ్మిదో తరగతి చదువుకుని ఇంట్లోనే ఉంటోంది. 
 
ఈ క్రమంలో కుమార్తెకు పెళ్లి చేయాలని అలీముద్దీన్ నిర్ణయించాడు. ఇందుకోసం కర్ణాటకలోని తమ బంధువుల అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. వరుడు తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. అయితే తనకు ఇప్పుడే పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదని, రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని తహసీన్ బేగం చెప్పగా, తొలుత నిశ్చితార్థం చేసుకుందామని చెప్పారు. దీంతో ఆమె కూడా సమ్మతించి.. నిశ్చితార్థానికి సమ్మతించింది. 
 
అప్పటినుంచి ముభావంగా ఉంటున్న తహసీన్ బేగం మనస్తాపానికి గురై.. ఇంట్లోనే ముభావంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూమ్‌లో చీరకు ఉరేసుకుని ప్రాణలు తీసుకుంది. మూత్ర విసర్జన కోసం తమ్ముడు అరిఫ్ బాత్రూమ్‌ వద్దకు వెళ్లి తలుపు తీసేందుకు ప్రయత్నించగా, లోపల గడియపెట్టివుండటాన్ని గనమనించాడు. ఆ తర్వాత ఇరుగుపొరుగువారికి చెప్పడంతో వారు వచ్చి చూడగా, ఉరివేసుకుని చనిపోయిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments