Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త కరోనాతో ఆసుపత్రిలో, సాయం చేస్తానంటూ అతడి భార్యను లొంగదీసుకున్న భర్త ఫ్రెండ్

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (22:15 IST)
భర్త కరోనాతో ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చేరి ఐదు రోజులవుతోంది. సరుకులూ అవీఇవీ తెచ్చిస్తానంటూ భర్త స్నేహితుడు ఆమెతో సన్నిహితంగా వుండటం మొదలుపెట్టాడు. మెల్లగా ఆమెను లొంగదీసుకున్నాడు. భర్త ఇంట్లో లేకపోవడంతో ఈ వ్యవహారం అంతా స్వేచ్చగా సాగిపోయింది. ఉన్నట్లుండి భర్త ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చి ఇంట్లో భార్య, అతని స్నేహితుడు సన్నిహితంగా వుండటాన్ని చూసి షాకయ్యాడు.
 
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పాతబస్టాండ్ సెంటర్ న్యూ వేంకటేశ్వర కాలనీకి చెందిన శ్రీనివాస్, సునీతకు సంవత్సరం క్రితమే వివాహమైంది. శ్రీనివాస్ స్థానికంగా ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం కరోనా లక్షణాలుంటే పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది.
 
దీంతో స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. శ్రీనివాస్ స్నేహితుడు రాజేష్ గతంలో తరచూ ఇంటికి వెళుతుండేవాడు. శ్రీనివాస్ ఆసుపత్రిలో ఉండటంతో ఇంట్లో సహాయం కోసం రాజేష్‌ను పంపించాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడం.. రాజేష్ మెల్లగా ఆమెకు సాయం చేస్తానంటూనే లొంగదీసుకున్నాడు.
 
ఇలా ఐదురోజుల పాటు సాగింది. అయితే కరోనా లక్షణాలు తక్కువగా ఉండటం, త్వరగా శ్రీనివాస్‌ను డిశ్చార్జ్ చేసి పంపించడంతో ఇంటికి వచ్చేశాడు. ఇంట్లో రాజేష్, సునీత కలిసి ఉండటాన్ని చూశాడు శ్రీనివాస్. దీంతో షాక్‌కు గురయ్యాడు. శ్రీనివాస్‌ను ప్రశ్నించాడు. అయిత అతను అక్కడి నుంచి పారిపోయాడు. 
 
విషయం బయటకు పొక్కుతుందని సునీత ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాస్ పైన ఇద్దరూ కలిసి దాడి చేశారు. శ్రీనివాస్ మేల్కొని గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు వచ్చారు. ఇంతలో సునీత, రాజేష్ ఇద్దరూ పరారయ్యారు. శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

తర్వాతి కథనం
Show comments