Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు నాకు నచ్చలేదు వెళ్లిపో అన్న భర్త... తనువు చాలించిన భార్య... ఎక్కడ?

ప్రేమించి పెళ్ళి చేసుకుని రెండు నెలలు కాపురం చేసిన తర్వాత 'నువ్వు నాకు నచ్చలేదు వెళ్లిపో' అని భర్త అనడంతో ఆ వివాహిత ఏం చేయాలో తెలియక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (09:31 IST)
ప్రేమించి పెళ్ళి చేసుకుని రెండు నెలలు కాపురం చేసిన తర్వాత 'నువ్వు నాకు నచ్చలేదు వెళ్లిపో' అని భర్త అనడంతో ఆ వివాహిత ఏం చేయాలో తెలియక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట రూరల్ మండలంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చిన్నకోడూరు మండలం మేడిపల్లికి చెందిన ఉమ్మెంతల మాధవి (28) సిద్దిపేట అర్బన్‌ మండలానికి చెందిన కట్కూరి శ్రీనివాస్‌ పదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మే 12న కూడవెళ్లి రామలింగేశ్వర దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే, మాధవికి ఇది రెండో వివాహం. ఈ పెళ్లికి ముందే అంటే ఎనిమిదేళ్ల క్రితం మరొకరితో వివాహమైంది. పెళ్లయిన ఆరు నెలలకే విడాకులు తీసుకుంది. ఇదంతా తెలిసి శ్రీనివాస్‌ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 
 
తీరా రెండు నెలలు గడిచిన తర్వాత నువ్వు నాకు నచ్చలేదు వెళ్లిపో అంటూ ఛీకొట్టాడు. పైగ్, అత్తంటి వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. ఈ నెల 15న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. ఆమె చనిపోయే ముందు సూసైడ్ లేఖ రాసిపెట్టింది. భర్తతోపాటు.. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments