ఎంబీఏ విద్యార్థినికి మత్తుమందిచ్చి రేప్.. ఆపై అశ్లీల వీడియో...

దేశరాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో మరో దారుణం జరిగింది. ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం మానేసి.. ఎంబీఏ చదువుతున్న విద్యార్థినిపై ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈమెకు మత్తుమందు ఇచ్చి.. ఆపై రేప్ చ

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (09:08 IST)
దేశరాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో మరో దారుణం జరిగింది. ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం మానేసి.. ఎంబీఏ చదువుతున్న విద్యార్థినిపై ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈమెకు మత్తుమందు ఇచ్చి.. ఆపై రేప్ చేసి వీడియో తీశాడో కామాంధుడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రాయిచ్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఎయిర్ హోస్టెస్‌‌గా కొంతకాలం పాటు పని చేసింది. ఇపుడు ఉద్యోగం మానేసి.. ఎంబీఏ చదువుతోంది. ఈమెపై సెక్టార్ - 45లోని ఒక అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్న అమిత్ చౌహాన్ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. 
 
ఆమెకు మత్తుమందిచ్చిన చౌహాన్.. అత్యాచారం జరిపి, అశ్లీల వీడియో తీశాడు. ఈ దారుణం 3నెలల క్రితం జరిగింది. దీనిని తెలుసుకున్న ఆ యువతి ఎదిరించడంతో... చౌహాన్ ఆమెను తీవ్రంగా కొట్టి చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 
 
పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు తరలించారు. నోయిడా, సెక్టార్ -9 పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడింది ఆమె స్నేహితుడే కావడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments