Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానపు భర్త, భార్య సున్నిత అవయవాలు కోసి కారం చల్లి...

భార్యపై అనుమానంతో భర్త అత్యంత కిరాతకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. ఆమె అవయవాలు కోసం కారం చల్లాడు. నిప్పుతో కాల్చి పైశాచికంగా వ్యవహరించాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బేతంచెర్ల మండలానికి చెందిన యువతి, కృష్ణగిరి మండలానికి చ

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (15:06 IST)
భార్యపై అనుమానంతో భర్త అత్యంత కిరాతకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. ఆమె అవయవాలు కోసం కారం చల్లాడు. నిప్పుతో కాల్చి పైశాచికంగా వ్యవహరించాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బేతంచెర్ల మండలానికి చెందిన యువతి, కృష్ణగిరి మండలానికి చెందిన రత్నమయ్య కుమారుడు రాజుకి ఇచ్చి 14 నెలల క్రితం వివాహం జరిపించారు. వారి కాపురం 15 రోజుల బానే సాగినా ఆ తరువాత సంసారంలో  కలతలు మొదలయ్యాయి. 
 
అప్పటి నుంచి భార్యపై అనుమానంతో పలుమార్లు చిత్రహింసలకు గురిచేశాడు. మంగళవారం మరింత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి, సున్నిత అవయవాలను కోసి కారం చల్లాడు. నిప్పుతో ఆమె కాళ్లు, నడుమ భాగంలో కాల్చాడు. రాత్రంతా భర్త పెట్టిన  బాధలను భరించిన యువతి ఉదయం అతను లేని సమయంలో తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. 
 
నిందితుడు రాజు మొదటి నుంచి అనుమాన ధోరణితో వ్యవహరించేవాడని, రాజుకు మొదటి వివాహం అత్త కూతురుతో జరగ్గా ఆమెను ఇలానే చిత్రహింసలకు గురిచేయడంతో విడిపోయిందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో వున్నట్లు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments