Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ బట్టలిప్పమని, ఠక్కున ఆ పని చేసిన భర్త

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (18:31 IST)
కొత్తగా పెళ్ళయ్యింది. ఉద్యోగం వేరే రాష్ట్రంలో ఉండటంతో భార్యను తరువాత తీసుకెళదామని ఒక్కడే వెళ్ళాడు. ఎప్పటిలాగే సింగిల్ రూమ్‌లో గడుపుతూ ఉన్నాడు. భార్యతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడేవాడు. కానీ ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. 
 
మధ్యప్రదేశ్ బాలాగ్ హాట్ జిల్లా తెలిసిల్లాబర్రాకు చెందిన పంకజ్‌కు చిత్తూరు జిల్లా సోమలకు చెందిన కిరణ్ కుమారితో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. మధ్యప్రదేశ్‌లో బ్యాంకు అధికారిగా పనిచేస్తున్నాడతను. భార్య కూడా అగ్రికల్చరర్ ఫీల్డ్ ఆఫీసర్.
 
భార్యకు ఇక్కడ పర్మినెంట్ ఉద్యోగం కావడం.. తను కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తుండటంతో భార్యను ఇక్కడే వదిలి వెళ్లాడు. అయితే భార్య లేదన్న బాధ అతనిలో నెలకొంది. దాంతో పాటు స్నేహితులు సూటిపోటి మాటలనడం అతన్ని తీవ్రంగా కలిచివేసింది. 
 
నువ్వు ఇక్కడుంటే నీ భార్య ఇంకొకరితో అంటూ ప్రాణ స్నేహితులే హేళన చేయడంతో అతను మనస్థాపానికి గురయ్యాడు. ఎప్పటి లాగా భార్యతో వీడియో కాల్ మాట్లాడాడు. ఆమెతో మాట్లాడుతూ బట్టలిప్పమన్నాడు. భర్త ఎందుకు అలా అడుగుతున్నాడో కిరణ్ కుమారికి అర్థం కాలేదు. చివరిసారి నిన్ను చూడాలని చెబుతూ ఉన్నట్లుండి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసేసుకున్నాడు. భార్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. స్నేహితులకు ఫోన్ చేసి చెప్పేలోపే భర్త చనిపోయాడు. దీంతో కిరణ్ కుమారి కన్నీటి పర్యంతమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments