Webdunia - Bharat's app for daily news and videos

Install App

Husband Sucide: భార్యను హతమార్చాడు.. సమాధి వద్దే ఆత్మహత్య

సెల్వి
సోమవారం, 9 డిశెంబరు 2024 (10:52 IST)
భార్యతో జరిగిన గొడవలో భర్త ఆమెను హతమార్చాడు. దీంతో జైలుపాలైన భర్త ఆరు నెలల తర్వాత బెయిల్‌పై వచ్చి..భార్య సమాధి వద్దే ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి, సుజాత దంపతులు బెంగళూరుకు వలస వెళ్లారు. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. 
 
మనస్పర్థల కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ గొడవల్లో భర్త చేతిలో భార్య హతమైంది. అటుపై పోలీసులకు లొంగిపోయిన గంగిరెడ్డిని కోర్టు జైలుకు పంపించింది.
 
ఆరు నెలల పాటు జైలులో గడిపిన గంగిరెడ్డి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు. శనివారం సుజాత సమాధి వద్ద ఓ చెట్టుకు వేలాడుతున్న గంగిరెడ్డి మృతదేహం కనిపించింది. భార్యను చంపేసినందుకు పశ్చాత్తపంతో గంగిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments