Telangana Techie: అమేజాన్‌లో అప్లైడ్ సైంటిస్ట్‌గా తెలంగాణ అబ్బాయి.. రూ.2కోట్ల ప్యాకేజీ

సెల్వి
సోమవారం, 9 డిశెంబరు 2024 (10:25 IST)
Telangana Boy
తెలంగాణకు చెందిన అర్బాజ్ ఖురేషి అనే యువకుడు గ్లోబల్ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో రూ.2 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని పొందాడు. వికారాబాద్ జిల్లా బొమ్రాస్‌పేట మండలం తుంకిమెట్ట గ్రామానికి చెందిన ఆయన అమెజాన్‌లో అప్లైడ్ సైంటిస్ట్‌గా నియమితులై విధుల్లో చేరనున్నారు. 
 
ఖురేషి 2019లో ఐఐటీ పాట్నా నుండి కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ పూర్తి చేశాడు. తన మూడవ సంవత్సరంలో, అతను ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత మెషీన్ లెర్నింగ్ నిపుణుడు దియాస్ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేశాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత, అతను బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లో రెండేళ్లపాటు పనిచేశారు. 
 
అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుండి ఏఐ మెషిన్ లెర్నింగ్‌లో ఎంఎస్ చదివారు. దానిని గత సంవత్సరం పూర్తి చేశాడు. ప్రస్తుతం ఎక్సైజ్ జాయింట్ కమీషనర్‌గా పనిచేస్తున్న అతని తండ్రి యాసిన్ ఖురేషి తన కుమారుడి అద్భుత విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: సినిమా వ్యాపారంలో కొత్త ఫార్మెట్ లో హీరో అల్లు అర్జున్

యుఫోరియా కొత్త ఫార్మెట్ లో వుందనే అభినందిస్తున్నారు : గుణ‌శేఖ‌ర్‌

Rishabh Sawhney : నాగబంధం నుంచి అబ్దాలిగా ఫైటర్ ఫేమ్ రిషబ్ సాహ్నీ లుక్

పొదుపరి ప్రేమకథగా సుమతీ శతకం మూవీ ఎలావుందంటే...

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chaddannam: మహిళలు రోజూ చద్దన్నం తీసుకుంటే ఫలితం ఏంటి?

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

తర్వాతి కథనం
Show comments