Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.. గర్భవతి అయ్యిందే పారిపోయాడు.. ఎక్కడ?

ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అత్తింట్లో తిష్ట వేశాడు. భార్య 6 నెలల గర్భవతికాగానే కట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. కట్నం ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి పరారయ్యాడు.

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (10:44 IST)
ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అత్తింట్లో తిష్ట వేశాడు. భార్య 6 నెలల గర్భవతికాగానే కట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. కట్నం ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి పరారయ్యాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీకాళహస్తి హరహర బాయ్ వీధికి చెందిన రజియా, చాన్ బాషాలు ప్రేమించుకుని సంవత్సర క్రితం ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. వివాహమైన తర్వాత రజియా ఇంటిలోనే చాన్ బాషా కాపురం పెట్టాడు. కొన్నినెలల పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. 
 
రజియా గర్భవతి అయినప్పటి నుంచి చాన్ బాషా కుటుంబ సభ్యుల నుంచి రజియాకు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. అడిగినంత కట్నం ఇవ్వకుంటే చాన్ బాషాకు వేరొకరితో వివాహం చేస్తామని బెదిరించసాగారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో రజియా కుటుంబ సభ్యులు వరకట్నం ఇవ్వడం వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో చాన్ బాషా కుటుంబ సభ్యులు అతన్ని తీసుకొని శ్రీకాళహస్తి వదిలి వెళ్ళిపోయారు. తనకు న్యాయం చేయాలంటూ రజియా పోలీసులకు ఆశ్రయించింది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోగా తనను బెదిరించి పంపేస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం