Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య - ప్రియుడు ఏకాంతంగా ఉన్నపుడు భర్త ఏం చేశాడో తెలుసా?

కట్టుకున్న భార్య తననుకాదని మరో యువకుడితో వివాహేతర శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేక పోయాడు. భార్య మనసు మార్చి దారికి తెచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ, ఆమె భర్త మాటను పెడచ

Webdunia
గురువారం, 5 జులై 2018 (09:53 IST)
కట్టుకున్న భార్య తననుకాదని మరో యువకుడితో వివాహేతర శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేక పోయాడు. భార్య మనసు మార్చి దారికి తెచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ, ఆమె భర్త మాటను పెడచెవిన పెట్టడమే కాకుండా, మరింతగా రెచ్చిపోయింది. తన భర్త కళ్లుగప్పి ప్రియుడుని ఇంటికి పిలిపించి ఏకాంతంగా ఉండసాగింది. భార్య ప్రవర్తనను భర్త జీర్ణించుకోలేక పోయాడు.
 
తనను మోసం చేస్తూ మరో వ్యక్తితో ఉండటాన్ని సహించలేకపోయాడు. భార్య, ప్రియుడు ఇంట్లో ఉన్న సమయంలో కిరాతకానికి ఒడిగట్టాడు. ఇంటికి బయటి నుంచి గడియపెట్టి.. పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. ఈ ఘటన ఏపీ రాష్ట్రం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కోళ్లమిట్టలో జరిగింది. మహిళతో ఆమె ప్రియుడు సజీవ దహనం అయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కోళ్లమిట్టకు చెందిన హరిబాబు అనే వ్యక్తితో కవిత అనే మహిళకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో కవితకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్యను మందలించాడు. దీనిపై గొడవలు జరిగి, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. అయినా భార్య కవితలో మార్పురాలేదు. 
 
ఈ క్రమంలోనే భర్త హరిబాబు జూలై 4వ తేదీ మధ్యాహ్నం బయటకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చే సమయానికి.. లోపల భార్యతో మరో వ్యక్తి ఉన్నాడు. వెంటనే పెట్రోల్ తీసుకొచ్చాడు. ఇంటికి బయట నుంచి గడియపెట్టాడు. ఇంటిపైన, ఇంట్లోకి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. వీరిద్దరూ గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ప్రాణాలు విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments