Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ - ఏలూరులో మనిషికి వైరస్ సోకింది!!

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (13:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్టు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ఉంగుటూరు మండల పరిధిలోని కోళ్లఫారం సమీపంలో ఉంటున్న ఓ వ్యక్తికి ఈ ఫ్లూ సోకినట్టు తేలింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా వైద్యశిబిరాన్ని నిర్వహించి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపిస్తున్నారు. ఏపీలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌కు సంబంధించిన తొలి కేసు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, గత కొన్ని రోజులుగా ఉభయగోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్ర ఎక్కువగా ఉంది. కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు ఇప్పటికే నిర్ధారణ కాగా, ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 50 లక్షలకు పై కోళ్లు ఈ ఫ్లూ వైరస్ కారణంగా చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. 
 
అందువల్ల చికెన్ మాంసానికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. ఒకవైపు అధికారుల హెచ్చరికలు, మరోవైపు బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియాలో హెచ్చరికల నేపథ్యంలో చికెన్ కొనుగోళ్ళు తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఫలితంగా కేజీ చికెన్ రూ.30కే లభ్యమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments