Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హమ్మయ్య రోడ్లు వేశారు.. పవన్‌కు కృతజ్ఞతలు.. ఎక్కడ?

Advertiesment
Roads

సెల్వి

, మంగళవారం, 5 నవంబరు 2024 (11:18 IST)
Roads
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పిఠాపురం ప్రజలు పెద్ద మనస్సుతో నన్ను గెలిపించారు. 
 
పిఠాపురం ప్రజలకు నేను ఋణపడి ఉంటానని అన్నారు. భవిష్యత్తులో పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజక వర్గంగా మార్చి చూపిస్తానని, రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. చెప్పినట్లే పిఠాపురంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఏరియా డెవలప్మెంట్ చేసేందుకు ఒక ఏజెన్సీని ఏర్పాటు చేస్తానన్న పవన్.. త్రాగు నీరు, పారిశుధ్యంపై దృష్టి పెట్టామన్నారు. అభివృద్ధి చేసేందుకు జిల్లా నాయకులు, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని పవన్ సూచించారు. 
 
అలాగే పశ్చిమ గోదావరిలో కూడా రోడ్లు బాగుపడుతున్నాయి. రోడ్ల నిర్మాణ పనులు జోరందుకున్నాయి. తణుకు- నర్సాపూర్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఐటంపూడి గ్రామ పంచాయతీ, ఇరగవరం మండలంలో రోడ్లన్నీ బాగుపడ్డాయి. 
 
మట్టి రోడ్ల వరకు పనులు పూర్తయ్యాయి. ఈ రోడ్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ప్రాంత వాసులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

9 నుంచి శ్రీశైలం - విజయవాడల మధ్య సీ ప్లేన్ ప్రయోగం