Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్యాలగూడలో పరువు హత్య.. కమ్మకులం అమ్మాయిని ప్రేమించి...

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య జరిగింది. దళిత యువకుడు ఒకరు కమ్మ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడుని దారుణంగా హత్యచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (17:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య జరిగింది. దళిత యువకుడు ఒకరు కమ్మ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడుని దారుణంగా హత్యచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మిర్యాలగూడకు చెందిన దళిత యువకుడు ప్రణయ్. అదే ప్రాంతానికి చెందిన కమ్మకులానికి చెందిన అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యారు. గత యేడాదిన్నరగా కలిసి కాపురం చేస్తున్నారు. ఈ క్రమంలో అమృత గర్భందాల్చింది. 
 
దీంతో నల్లొండ జిల్లా మిర్యాలగూడలో ఉన్న ఓ ఆస్పత్రికి ఆరోగ్య చెకప్‌ కోసం తన భార్య జ్యోతిని తీసుకొచ్చాడు. వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత తన వెంట తీసుకుని బయలుదేరాడు. ఈ క్రమంలో వెనుక నుంచి పెద్ద కత్తితో వచ్చిన ఓ యువకుడు ప్రణయ్‌ మెడపై అత్యంత పాశవికంగా నరికాడు. 
 
ఒక్క దెబ్బతో కిందపడిపోగా, రెండోసారి మెడపై నరకడంతో ప్రాణాలు విడిచాడు. పక్కా ప్లాన్‌తో ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్దే ఈ హత్య జరిగింది. ఈ దాడిని అడ్డుకునేందుకు అమృత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన ఆమె అక్కడ నుంచి ఆస్పత్రిలోకి పరుగులు తీసింది.  
 
ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు ఆస్పత్రిలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా నమోదైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments