Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పేరు ‘శ్రీ గోవిందం భవనం’... తలుపు తెరిస్తే అక్రమాస్తుల నిలయం... విశాఖ అవినీతి 'కింగ్'

అసలే ప్రభుత్వాధికారి... ఇక వక్ర మార్గంలో ఆదాయం గాదె కింద వేసుకోవడం మొదలుపెడితే... ఇంకేముంది? డబ్బు మబ్బు వరకూ వెళుతూంది. అక్రమాస్తుల అంతు అంతే లేకుండా పోతోంది. విశాఖ గాజువాకలో అవినీతి చేపకు సంబంధించి ఏసీబీ చేస్తున్న తనిఖీల్లో కళ్లు చెదిరే అక్రమాస్తుల

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (19:20 IST)
అసలే ప్రభుత్వాధికారి... ఇక వక్ర మార్గంలో ఆదాయం గాదె కింద వేసుకోవడం మొదలుపెడితే... ఇంకేముంది? డబ్బు మబ్బు వరకూ వెళుతూంది. అక్రమాస్తుల అంతు అంతే లేకుండా పోతోంది. విశాఖ గాజువాకలో అవినీతి చేపకు సంబంధించి ఏసీబీ చేస్తున్న తనిఖీల్లో కళ్లు చెదిరే అక్రమాస్తులు బయటపడుతున్నాయి. విశేషమేమిటంటే... ఆయన తన ఇంటి పేరును చాలా పద్ధతిగా, భక్తిగా ‘శ్రీ గోవిందం భవనం’ అని పెట్టుకోవడం. 
 
పేరుకు గోవింద అంటూ శఠగోపం ఎందరికి పెట్టారోనన్నది ఇప్పుడు వెలుగుచూస్తున్న అక్రమాస్తులు పట్టి చెపుతున్నాయి. విశాఖ లోని గాజువాక సబ్ రిజిస్ట్రార్ దొడ్డపనేని వెంకయ్య నాయుడు ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి తనిఖీలు జరుగుతూనే వున్నాయి. ఇప్పటివరకూ రూ. 6 కోట్లకు పైగా అక్రమాస్తులు ఏసీబి కనుగొన్నారు. ఐతే ఈ అక్రమాస్తులు సుమారుగా రూ.100 కోట్ల వరకూ వుండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇక ఆయన అక్రమాస్తుల చిట్టాను పరిశీలిస్తే... విశాఖలో 15 ఇళ్ల స్థలాలు, నర్వలో 4 ఎకరాల భూమి, 1.75 కిలోల బంగారం,1.35 కిలోల వెండి, రూ.20 లక్షల విలువైన వస్తువులు, రూ.42 లక్షల నగదు, రూ.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ. 5 లక్షల పత్రాలు గుర్తించారు. ఇంతేనా... అంటే అంతేకాదండోయ్... విశాఖ కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో లాకర్, మామ పేరుతో తిరుపతిలో ఐదంతస్తుల లాడ్జి, తోడల్లుడు పేరుతో తుంగ్లాంలో ఓ భవనం కూడా వుంది. మొత్తమ్మీద ఈ అవినీతి తిమింగలం అక్రమాస్తుల అంతు ఎంతో ఇంకా తేల్చే పనిలో వున్నది అవినీతి నిరోధక శాఖ.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments