Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల లేరన్నది ఓ నమ్మలేని నిజం : ఎమ్మెల్యే బాలకృష్ణ

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (16:43 IST)
మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద రావు మన మధ్య లేరన్నది ఓ నమ్మలేని నిజం అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన కోడెల ఆత్మహత్యపై బాలకృష్ణ స్పందించారు. 
 
కోడెల శివప్రసాదరావు తమ మధ్య లేరన్న వార్త చాలా బాధాకరంగా ఉందని, ఓ నమ్మలేని నిజం అని అన్నారు. కోడెల ఓ రాజకీయనాయకుడిగా, వైద్యుడిగా సమాజానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, అందరి హృదయాల్లో పదిలంగా ఉంటారని అన్నారు. 
 
కాగా, తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన బసవతారకం ఆస్పత్రిని కోడెల ఫౌండర్ ఛైర్మన్‌గా ముందుడి ఈ స్థాయికి తీసుకొచ్చారన్నారు. కోడెల ఎంతో మందికి ఆదర్శనీయుడని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మరిచిపోలేని సేవలు అందించారని, కోడెల ఏ పదవులో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారని అన్నారు. 
 
అలాగే, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, కోడెల శివప్రసాద్ చివరి శ్వాస వరకూ పార్టీ కోసం పరితపించారన్నారు. వ్యక్తిగతంగా ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కోడెల కుటుంబానికి తన సంతాపం తెలిపారు. కోడెల మృతిపై మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments