తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణ వార్త కలచి వేసింది. వైద్యుడిగా ప్రజాసేవ ప్రారంభించిన ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకరుగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారాకరామారావు సతీమణి శ్రీ బసవతారకమ్మ పేరిట ఏర్పాటు చేసిన బసవతారకం కేన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ హోదాలో కూడా ఆయన ఎనలేని సేవలందించారు.
మా తండ్రిగారు స్వర్గీయ దేవినేని నెహ్రూతో శివప్రసాదరావుకి అవినాభావ సంబంధం ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలినాళ్ళలో యువ నాయకులుగా ఇద్దరూ కలిసి పార్టీకి సేవ చేసిన సేవలు మరువ లేనివి. గుంటూరు జిల్లాలో పార్టీకి జవసత్వాలు నింపి క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం పార్టీకి అండగా నిలబడిన కోడెల ఈ విధంగా మరణించడం అనేది నిజంగా కలచివేస్తుంది. ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తూ ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను.