ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు అప్.. జూలై 1 నుంచే అమలు

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (21:30 IST)
ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి.పెరిగిన ధరలు జూలై 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ గురువారం (జూన్ 30) ఉత్తర్వులు వెలువరించింది. 
 
డీజిల్‌ సెస్‌ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10గా ఉండగా.. తొలి 30 కిలోమీటర్ల వరకు ఎలాంటి పెంపు లేదని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. 
 
35 కి.మీ. నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5 సెస్‌ విధిస్తున్నట్లు తెలిపింది. ఇక 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10, వంద కిలోమీటర్లు ఆపైన రూ.20 సెస్‌ విధించారు.
 
ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.5 చొప్పున సెస్ వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ 30 కి.మీ. దూరం వరకు ఎలాంటి సెస్‌ పెంపు లేదు. 31 కి.మీ. నుంచి 65 కి.మీ వరకు రూ.5 సెస్‌. 66 కి.మీ. నుంచి 80 కి.మీ వరకు రూ.10 సెస్ విధించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

Roshan: ఛాంపియన్ నుంచి మనసుని హత్తుకునే పాట సల్లంగుండాలే రిలీజ్

Harsha Chemudu: ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది : హర్ష చెముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments