Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో వెల‌గ‌పూడిలో భారీ బందోబ‌స్తు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (11:03 IST)
వెలగపూడిలోని సచివాలయంలో అసెంబ్లీ సమావేశం జ‌రుగుతున్న దృష్ట్యా సచివాలయ పరిసర ప్రాంతాల్లో గుంటూరు రూర‌ల్ పోలీసులు పటిష్టమైన బందోస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర గౌరవ అదనపు డిజీపీ రవి శంకర్ అయ్యనార్, ఆధ్వ‌ర్యంలో గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఈ బందోబ‌స్తును ప‌ర్య‌వేక్షిస్తున్నారు. 
 
 
అసెంబ్లీ సమావేశాల‌కు ముఖ్యమంత్రి, వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు హాజరవుతున్న సందర్భంగా అసెంబ్లీ, మండలి సమావేశ ప్రాంగణాలు, సచివాలయ పరిసర ప్రాంతాల్లో పూర్తి పటిష్ఠమైన భద్రత చర్యలు తీసుకున్నామని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ఆయ‌న అసెంబ్లీ ప్రాంగణం, స‌చివాలయ పరిసర ప్రాంతాల్లో కలియ తిరిగి బందోబ‌స్తు ఏర్పాట్ల‌ను పరిశీలించారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులతో మాట్లాడి, అసెంబ్లీ సమావేశము ముగిసే వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటూ, అనుమానాస్ప‌ద వ్య‌క్తుల‌ను గుర్తించాల‌ని, ఎల‌ర్ట్ గా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

 
రాష్ట్రంలో రాజ‌కీయ హీట్ ఎక్కువ‌గా ఉన్న త‌రుణంలో ఈ ప్ర‌త్య‌క ప‌రిస్థితుల్లో ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు తావు లేకుండా ఈసారి పోలీసులు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments