Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ రెడ్డి రద్దు చేసిన పథకాల వివరాలివే: తెలుగుదేశం పార్టీ

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (23:33 IST)
రాష్ట్రంలో గత రెండున్నరేళ్లలో దళితులపై జరిగిన దాడులు, సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న మోసం, దగాపై తెలుగుదేశం పార్టీ 29 ఎస్సీ నియోజకవర్గ ఇంఛార్జులు, నాలుగు పార్లమెంటు ఇంఛార్జులతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు.

జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో దళితులపై దాదాపు 158 దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అరాచకానికి బాధితులుగా నిలిచిన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని నేతలు పేర్కొన్నారు. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

సంక్షేమ పథకాల పేరుతో హడావుడి చేస్తున్న జగన్ రెడ్డి.. రూ.4,426 కోట్ల సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లించి రాజ్యాంగ హక్కుల్ని తుంగలోతొక్కారు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దళితులకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహించారు. తెలుగుదేశం ప్రభుత్వం దళితుల సంక్షేమానికి, సాధికారతకు అనేక కార్యక్రమాలు అమలు చేసిందని, ఆస్తులతో కూడి సంక్షేమాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు.

కానీ.. గత రెండున్నరేళ్లుగా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఆస్తుల సృష్టి లేదన్నారు. పైగా సెంటు పట్టాల పేరుతో దళితుల నుండి దాదాపు 6వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని, 2500 ఎకరాల లిడ్ క్యాప్ భూముల్ని స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడి, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని నేతలు పేర్కొన్నారు. 

తెలుగుదేశం ప్రభుత్వం దళితుల కోసం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమం ఉద్దరించేస్తున్నామంటూ జగన్ రెడ్డి ప్రచారం చేసుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని కూడా అమలు చేయలేకపోవడాన్ని ఆక్షేపించారు.
 
జగన్ రెడ్డి రద్దు చేసిన పథకాల వివరాలు :
1. ఎస్సీ సబ్ ప్లాన్ 
2. కేంద్ర ప్రాయోజిత పథకాలు నిర్వీర్యం
3. విదేశీ విద్య రద్దు
4. ఎస్సీ కార్పొరేషన్ల నిధుల మళ్లింపు
5. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు 
6. గురుకుల, రెసిడెన్షియల్ స్కూల్స్ లో సీట్లు రద్దు 
7. గ్రూప్స్, సివిల్స్ శిక్షణ కార్యక్రమాలు రద్దు 
8. ఇంటి నిర్మాణానికిచ్చే అధనపు సహాయం నిలిపివేత
9. పెళ్లి కానుకలు రద్దు
10. పండుగ కానుకలు రద్దు
11. కౌలు రైతుల సంఖ్యను కుదింపు
12. కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలు నిలిపివేత
13. దళితులకు భూమి కొనుగోలు, పంపిణీ, భూమి అభివృద్ధి కార్యక్రమాలు రద్దు 
14. ఇళ్ల పట్టాల పేరుతో అసైన్డ్ భూముల ఆక్రమణ
15. ఎస్సీ, ఎస్టీ చట్టం నిర్వీర్యం, ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు 
16. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలో ప్రాధాన్యత రద్దు
 
సంక్షేమ పథకాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం అంటూ చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. పైన తెలిపిన పథకాలు, కార్యక్రమాలపై సమాధానం చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. నాడు ఎన్టీఆర్ పేదల గుడిసెలను పక్కా ఇళ్లుగా మార్చారు. కొందరికే పరిమితమైన వరి భోజనం (స్వామి అన్నం) రెండు రూపాయలకే కిలోబియ్యం పేరుతో అందరికీ అందుబాటులోకి తెచ్చారు. గురుకుల పాఠశాలలు తెచ్చి నాణ్యమైన విద్యను దళిత బిడ్డలకు అందించారు.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అందరికీ విద్యను.. అందరికీ విదేశీ విద్య అందించే స్థాయికి తీసుకెళ్లారు. దళిత పిల్లలను విదేశాల్లో చదివించారు. దళితుల సాధికారతకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి, ప్రోత్సహిస్తే.. జగన్ రెడ్డి దళితులను ఓటు బ్యాంకుగా చూస్తూ.. సాధికారత, అభివృద్ధి అనే మాటే లేకుండా చేస్తున్నారంటూ నేతలు ఆగ్రహించారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, కె.ఎస్.జవహర్, పీతల సుజాత, పరసా వెంకటరత్నం, కోండ్రు మురళీ మోహన్, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, పాశం సునీల్ కుమార్,  బొబ్బిలి చిరంజీవులు, తెనాలి శ్రావణ్ కుమార్,

తంగిరాల సౌమ్య, కె. ఈరన్న, విజయ్ కుమార్, చిల్లా జగదీశ్వరి, అధికార ప్రతినిధులు  జి.ఎరిక్సన్ బాబు, పిల్లి మాణిక్యరావు, మోకా ఆనంద సాగర్, సాంస్కృతిక సెల్ అధ్యక్షులు నరసింహ ప్రసాద్, వర్ల కుమార్ రాజా , సేవల దేవదత్ , జై రాజ్, చుక్క పురుషోత్తం, గుర్రాల రాజు విమల్ తదితర దళిత నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments