Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ లోనే నేతన్నలకు సాయం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (21:10 IST)
సొంత మగ్గం కలిగి ఉండి చేనేత వృతిపై ఆధారపడి జీవనం సాగిస్తోన్న నేతన్నలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నేతన్న పథకం రెండో విడత అమలులో వేగం పెంచాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు.

అర్హులైన ప్రతి చేనేత లబ్ది పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హత కలిగి ఏ  ఒక్కరూ ప్రభుత్వ సాయం పొందకుండా ఉండే పరిస్థితి లేకుండా చూడాలని మంత్రి మేకపాటి సూచించారు.

జూన్ నెలలో రెండవ విడత నేతన్న నేస్తం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన చేనేతల జాబితా, పూర్తి వివరాలు, ఆన్‌లైన్‌ పోర్టల్ అప్ లోడింగ్, వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పేర్కొన్నారు.

చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్న విషయంలో కొన్ని కీలక అంశాలపై ఏజెన్సీ ద్వారా కచ్చితమైన సర్వే చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

వస్త్ర పరిశ్రమ ప్రాముఖ్యతను, ఉత్పత్తుల నాణ్యతను, ప్రచారాన్ని పెంచి చేనేతల కష్టాలకు  శాశ్వత పరిష్కారం చూపడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో చేనేత,జౌళి శాఖ డైరెక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments