Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 48 గంటలు వానలే వానలు.. హైదరాబాద్‌లో కుండపోత

చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే 48 గంటలపాటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కు

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (11:34 IST)
చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే 48 గంటలపాటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
 
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఒక మోస్తారు వర్షం, మరికొన్నిచోట్ల తేలికపాటిగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వరంగల్లు జిల్లా నల్లబెల్లిలో 9 సెంటీ మీటర్ల వర్షం నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌లో 8, కొందర్గులో 5, తిమ్మాజిపేటలో 5 సెం.మీ చొప్పున కురిసింది. రంగారెడ్డి జిల్లా యాచారంలో 6, గండీడ్‌లో 5, మార్పెల్లెలో 3 సెం.మీ చొప్పున వర్షం కురిసింది.
 
మరోవైపు హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచీ దట్టంగా మేఘాలు అలుముకుని వాతావరణం చీకటిగా మారింది. తొమ్మిది గంటల నుంచి భారీ వర్షం ప్రారంభమైంది. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, ఉప్పల్‌, రామాంతాపూర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. 
 
కళ్ల ముందు కూడా ఏముందో తెలియని విధంగా దట్టమైన చీకటి అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా కార్యాలయాలకు, పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నెమ్మదిగా సాగుతోంది. ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments