Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ భర్తలతో సంబంధం పెట్టుకుందనీ.. ఇద్దరు భార్యల ఘాతుకం

తమ భర్తలతో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఇద్దరు భార్యలు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (11:41 IST)
తమ భర్తలతో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఇద్దరు భార్యలు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
యడ్లపాడు మండలం తిమ్మాపురం ఎస్సీ కాలనీకి చెందిన పుల్లగూర శాంతి (29) అనే వివాహిత అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం పలువురు గ్రామస్థులకు కూడా తెలుసు. ఈ విషయంపై ఆమె చర్యను పలువురు గ్రామస్థులు కూడా ఖండించారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె గురువారం సాయంత్రం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఇంటి గోడకు ఉన్న రాతి దూలానికి నవారుతో వేలాడుతూ ఉండటాన్ని ఆమె కుమార్తె జ్యోతి గురువారం సాయంత్రం 5.00 గంటల సమయంలో గమనించి కేకలు వేసింది. 
 
దీనితో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను శాంతిని కిందకు దించి చూడగా ఆమె అప్పటికే మృతిచెందింది. ఆ తర్వాత సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
అయితే, శాంతి మృతిపై బంధువులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరితో శాంతికి వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో వారి భార్యలే హత్య చేసి ఉంటారని బంధువులు, భర్త ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం శాంతి ఒంటరిగా ఉండగా ఆ ఇద్దరి భార్యలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments