Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చంపి అద్దె ఇంట్లో పూడ్చిపెట్టి... రంకుమొగుడితో భార్య రాసలీలలు

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (10:44 IST)
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కిరాతక భార్య.. కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఆ తర్వాత తాము అద్దెకు నివసిస్తున్న ఇంట్లోనే పాతిపెట్టింది. ఆ పిమ్మట తన రంకుమొగుడు (ప్రియుడు)తో కలిసి స్వేచ్ఛగా సహజీవనం చేస్తూ వచ్చింది. చివరకు ఆమె పాపంపండి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఇటీవల చిరంజీవి అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. తన కుమారుడు చిరంజీవి కనిపించడం లేదంటూ చెరుకుపల్లికి చెందిన బల్లేపల్లి సుబ్బారావు వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలను కనుగొన్నారు. 
 
ఈ క్రమంలో చిరంజీవి భార్య కొల్లూరుకు చెందిన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది.
 
మూడు నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన నిందితురాలు చెరుకుపల్లిలో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పాతిపెట్టినట్టు చెప్పింది. ఆ తర్వాత ఆ ఇంటికి తాళం వేసి కొల్లూరు వెళ్లి ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్నట్టు తెలిపింది. 
 
ఇంటూరుకు చెందిన యువతితో చిరంజీవికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. కొల్లూరులో చిరంజీవి మెడికల్ షాపు నిర్వహించేవాడు. ఈ క్రమంలో అతడి స్నేహితుడితో నిందితురాలికి వివాహేతర సంబంధం ఏర్పడింది.
 
అదేసమయంలో చిరంజీవి ఓ ఇంటి స్థలాన్ని విక్రయించగా వచ్చిన రూ.20 లక్షలను ఇంట్లో భద్రపరిచాడు. విషయం తెలిసిన భార్య, భర్తను హత్యచేసి పూడ్చిపెట్టి ఆ డబ్బు పట్టుకుని ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. 
 
చిరంజీవి హత్య కేసుతో ప్రమేయం ఉన్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్టు రేపల్లె పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments