Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్కె తీర్చలేదని కత్తిపీటతో భర్త దాడి.. మేమిద్దరం మొగుడుపెళ్లాలమంటూ ఖాకీలపై భార్య ఫైర్

కొంతమంది భార్యాభర్తల తగవులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. తన కోర్కె తీర్చనందుకు భార్యపై కత్తిపీటతో భర్త దాడి చేశాడు. ఆ విషయం తెలిసిన పోలీసులు.. అక్కడకు చేరుకుని భర్తను అరెస్టు చేసి, గాయపడిన భార్యను ఆస్పత్రి

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (11:19 IST)
కొంతమంది భార్యాభర్తల తగవులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. తన కోర్కె తీర్చనందుకు భార్యపై కత్తిపీటతో భర్త దాడి చేశాడు. ఆ విషయం తెలిసిన పోలీసులు.. అక్కడకు చేరుకుని భర్తను అరెస్టు చేసి, గాయపడిన భార్యను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్న భార్య... నేరుగా ఠాణాకు చేరుకుని.. మేమిద్దరం మొగుడుపెళ్లాలం.. భార్యాభర్తలమన్నాక ఆమాత్రం గొడవలు కామనే. పైగా, మేము ఏమైనా చేసుకుంటాం. నా భర్తకు ఏమైనా జరిగితే ఒప్పుకునేది లేదంటూ పోలీసులను హెచ్చరించింది. దీంతో పోలీసులు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఈ ఘటన గంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వడ్డేశ్వరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (40) తన భార్యను కోర్కె తీర్చమని ప్రాధేయపడ్డాడు. కానీ, ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో కోపంతో భార్యపై కత్తిపీటతో దాడిచేశాడు. ఈ ఘటనలో ఆమెకు వీపు కింద భాగంలో తీవ్రమైన గాయమైంది. విపరీతంగా రక్తస్రావం జరగడంతో స్పృహ కోల్పోయింది. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 
అలాగే, పోలీసుల సూచన మేరకు క్షతగాత్రురాలిని బంధువులే ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. గాయమైన చోట 15 కుట్లు వేసి, రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. కానీ, ఆమె మాత్రం వైద్యుల సూచనలను పక్కన పెట్టి.. నేరుగా తన భర్తను అరెస్టు చేసిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ తన భర్తను విడిపించాలంటూ హుకుం జారీచేసి ఇంటికి వచ్చేసింది. 
 
తనపై జరిగిన దాడికి తాను ఎలాంటి ఫిర్యాదూ చేయడం లేదని, అందువల్ల తన భర్తను విడిపించాలని కోరింది. కానీ, పోలీసులు మాత్రం నిందితుడిని అదుపులోనే ఉంచుకున్నారు. సాయంత్రం మరోసారి సదరు మహిళ పోలీసులకు ఫోన్‌ చేసి.. తన భర్తను విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. 
 
భార్యాభర్తలన్న తర్వాత గొడవలు జరగకుండా ఎలా ఉంటాయి? కేసు పెట్టి మా పరువు తీసుకోమంటారా? అలాగైతే మేము మీపైనే ఫిర్యాదు చేస్తాం అంటూ ఆమె పోలీసులను హెచ్చరించింది. దీంతో దిక్కుతోచని పోలీసులు... ఏం చేయాలో అర్థంకాక తలలుపట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments