Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో వైద్యం వికటించి చిన్నారి మృతి

Webdunia
శనివారం, 14 మే 2022 (13:52 IST)
గుంటూరులో వైద్యం వికటించి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆరాధ్య అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

కంటి కురుపునకు చికిత్స కోసం నాలుగు రోజులు క్రితం చిన్నారి జీజీహెచ్‌లో చేరింది. శస్త్ర చికిత్స అనంతరం ఆరాధ్యను వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. వైద్యం వికటించి వెంటిలేటర్‌పైకి చేరినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. 
 
కాగా… చిన్నారి పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో నాలుగు రోజుల క్రితం జీజీహెచ్ నుంచి రమేష్ ఆసుపత్రికి తరలించారు. రమేష్ ఆసుపత్రిలో కూడా ఆరాధ్య వెంటిలేటర్‌కే పరిమితమైంది. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
 
నగర శివారు అంకిరెడ్డిపాలానికి చెందిన ఏడుకొండలు, పావని దంపతుల కుమార్తె ఆరాధ్య. 12 ఏళ్ల పాపకు కంటి కింద చిన్న కణితి ఏర్పడింది. 
 
చిన్నారి ఎదుగుతున్న కొద్ది కణితి ఇబ్బందికరంగా మారుతుందని భావించిన తల్లిదండ్రులు… దానిని తొలగించేందుకు జీజీహెచ్‌ వైద్యులను సంప్రదించారు. అక్కడ ఆపరేషన్‌కు వెళ్లిన చిన్నారి.. ఆపరేషన్‌కు తర్వాత తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments