Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం కన్నబిడ్డల్ని.. మేకులు వున్న కర్రతో కొట్టి..?

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (11:19 IST)
ప్రియుడి కోసం కన్నబిడ్డనే చిత్రహింసలకు గురిచేసింది.. ఓ కిరాతక తల్లి. ఇలాంటి మరో ఘటన తాజాగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన సొంత పిల్లలను చిత్ర హింసలకు గురిచేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పదేళ్లలోపు వయస్సు ఉన్న కుమారుడు, కుమార్తెను మేకులు ఉన్న కర్రతో కొట్టడంతో ఆ చిన్నారులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. 
 
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వార్డు సచివాలయంలోని మహిళా పోలీసులు ఆమెను పట్టుకుని స్టేషన్‌లో అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఓ మహిళకు వివాహం జరిగింది. ఆమెకు పదేళ్ల లోపు వయస్సు కలిగిన ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఆ మహిళ భర్త నుంచి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని.. సహజీవనం చేస్తోంది.
 
అయితే తాను ప్రియుడితో గడపకుండా ఆటంకం కలిగిస్తున్నారని కారణంతో సొంత కుమారుడు, కుమార్తెపై ఆమె మేకుల కర్రతో ఇష్టారీతిగా కొడుతూ.. దారుణంగా హింసించడం చేస్తోంది. మంగళవారం సైతం పిల్లలను దారుణంగా కొట్టి ఇంటి నుంచి గెంటేయడానికి ప్రయత్నించింది. 
 
దీంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు గమనించి వార్డు సచివాలయంలోని మహిళా పోలీసు అధికారికి సమాచారం అందించారు. దీంతో ఆ పోలీసు అక్కడికి వచ్చే సరికి ఆ మహిళ పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments