Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగుల శబ్ధానికి వరుడు పరుగులు.. పెళ్ళి వద్దన్న వధువు..

భారీ వర్షం పడుతోంది. తోడు పిడుగులు పడుతున్నాయి. అంతే పెళ్లి మండపంలోని వరుడు జడుసుకున్నాడు. పిడుగుల శబ్ధానికి పరుగులు తీశాడు. అంతే కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా తనకీ వివాహం వద్దని చెప్పేసింది వధువు. పి

Webdunia
ఆదివారం, 1 జులై 2018 (11:59 IST)
భారీ వర్షం పడుతోంది. తోడు పిడుగులు పడుతున్నాయి. అంతే పెళ్లి మండపంలోని వరుడు జడుసుకున్నాడు. పిడుగుల శబ్ధానికి పరుగులు తీశాడు. అంతే కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా తనకీ వివాహం వద్దని చెప్పేసింది వధువు. పిడుగుపడినందుకే పరుగులు తీసే ఈ వరుడు తనకొద్దని తెగేసి చెప్పేసింది.


పిడుగు పడ్డప్పుడే కాదు.. పిడుగు శబ్ధానికి తర్వాత కూడా వరుడు విచిత్రంగా ప్రవర్తించాడని.. అతడు మానసికంగా పరిణితి చెందలేదని భావిస్తున్నట్లు వధువు తెలిపింది. ఈ ఘటన బీహార్‌లోని సర్నా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
అయితే వధువు వరుడిని కాదన్నందుకు.. పెళ్లి వద్దని తెగేసి చెప్పినందుకు వరుడి కుటుంబీకులు, బంధువులు వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య మరింత గొడవ చెలరేగడంతో వధువు తరఫు బంధువులు రెచ్చిపోయి దాడికి దిగారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వధువు తరఫు ముగ్గురు బంధువులను అరెస్ట్‌ చేశారు. పెళ్లి మాత్రం ఆగిపోయింది. పిడుగు శబ్ధానికి భయపడే వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని వధువు పోలీసులతో వెల్లడించింది. ధైర్యం లేని వ్యక్తితో కాపురం చేయలేమని ఆమె తెగేసి చెప్పేసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments