ఎమ్మెల్సీ చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ఉద్యోగం

Webdunia
ఆదివారం, 29 మే 2022 (13:38 IST)
ఏపీలో అధికార వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన ఆయన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణతు ప్రభుత్వం ఉద్యోగం లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎం. విక్టర్ ప్రసాద్ శనివారం ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. 
 
కాకినాడ జిల్లా జి.మామిడాలలో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగా, అపర్ణకు ఆరోగ్య శాఖలో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆయన సోదరుడు నవీన్‌కు ఒప్పంద ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు. 
 
అలాగే, మామిడాడలోని జగనన్న కాలనీలో సుబ్రహ్మణ్యం భార్య, తల్లికి సెంటున్నర ఇంటి స్థలం కేటాయిస్తూ పట్టాలు అందించారు. ఆ స్థలంలో ప్రభుత్వమే ఇళ్ళు కట్టి ఇస్తుందని విక్టర్ ప్రసాద్ తెలిపారు. అలాగే, సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఇప్పటికే రూ.8.25 లక్షలు మంజూరైనట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments