Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వానికి మంచిపేరు తేవాలి: గ్రామ సచివాలయ ఉద్యోగులతో మంత్రి సురేష్

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (11:18 IST)
గ్రామ సచివాలయ ఉద్యోగులు బాధ్యతనెరిగి పనిచేయాలని, మీ పనితీరు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మార్కాపురం లోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాల వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, అగ్రికల్చర్ అసిస్టెంట్స్, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మీ ప్రతిభ ఆధారంగా ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగావకాశాలు కల్పించిందని, మీ బాధ్యతను గుర్తెరిగి మీరు పని చేయాలని ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళ పాటు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు సేవలు అందించి ప్రజా ప్రభుత్వం గా గుర్తింపు పొందిందని రాబోయే రోజుల్లో మీ పనితీరు ఆధారంగా ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరారు.  ముఖ్యంగా ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పై శ్రద్ధ చూపాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యా పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు అగ్రికల్చర్ అసిస్టెంట్లను సమన్వయం చేసుకుంటూ రైతులకు అందాల్సిన రాయితీలు సక్రమంగా అందించాలని ఆదేశించారు.

విత్తనాలు ఎరువులు పురుగు మందులు నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. అర్హులైన రైతులకు రైతు భరోసా కార్యక్రమం అందేలా చూడాలని, పంట నష్టపోతున్న రైతులకు భీమా సౌకర్యం పై అవగాహన కల్పించి లబ్ధి చేకూర్చాలని కోరారు. రైతులకు అందాల్సిన రాయితీల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments