Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులపై కోవాగ్జిన్ ట్రయల్స్ : కోర్టు అనుమతితో ఒకే?

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (11:16 IST)
దేశంలో చిన్నారుల‌పై క‌రోనా వ్యాక్సిన్ 'కొవాగ్జిన్' స‌మ‌ర్థంగా ప‌నిచేస్తుందా? అన్న విష‌యాన్ని తెలుసుకోవడానికి వారిపై ప్ర‌యోగాలు జరుగుతున్నాయి. ఈ మేర‌కు ఇప్ప‌టికే 2 నుంచి 18 ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమ‌తి కూడా ఇచ్చింది. 
 
అయితే, ఆ అనుమతిపై స్టే విధించాల‌ని, సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్‌ దాఖలు చేశారు. ట్రయల్స్‌లో పాల్గొనాల్సిన పిల్లలు తమకు తాము వాలంటీర్లుగా రిజిస్టర్‌ చేసుకుంటున్నారని ఆయ‌న‌ వ్యాజ్యంలో పేర్కొన్నారు. 
 
మైనర్లయిన పిల్లలకు వ్యాక్సిన్ ప్రయోగాల వల్ల తలెత్తే పరిణామాలపై అవగాహన ఉండదని, అంతేగాక‌, ఈ విషయంలో వారి తల్లిదండ్రుల అంగీకారం కూడా ఆమోదయోగ్యం కాదని అభ్యంత‌రాలు తెలిపారు.
 
అయితే, ట్ర‌య‌ల్స్‌పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే, ప్ర‌యోగాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు డీసీజీఐకు నోటీసులు జారీ చేసింది. కాగా, మరో ప‌ది రోజుల్లో రెండు, మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభంకానున్నాయి. 525 మందిపై ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments