Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్... ఏంటది?

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (16:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా పోలీసలకు వారాంతపు సెలవును ప్రకటించారు. ఈ వీక్లీ ఆఫ్ బుధవారం నుంచే అమల్లోకి రానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఏపీ శాంతి భద్రతల విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ రవిశంకర్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
పోలీసుల విక్లీ ఆఫ్‌పై ఆయన వెల్లడించిన వివరాల మేరకు.. నవ్యాంధ్రలోని పోలీసు శాఖలో పని చేసే కానిస్టేబుల్ నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు పని చేసే పోలీసులకు వారాంతపు సెలవును మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వీక్లీ ఆఫ్ విధానం ఇప్పటికే విశాఖపట్టణం జిల్లాలో అమలు చేస్తుండగా, ఇపుడు వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. 
 
ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. ఈ వారాంతపు సెలవుతో పోలీసులు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని, తద్వారా అనారోగ్యం బారినపడకుండా ఉండేందుకు అవకాశం ఉందన్నారు. పైగా, వీక్లీ ఆఫ్‌పై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments