దేశ రాజధాని నగరం ఢిల్లీలో పట్టపగలే ఓ ఆటో డ్రైవర్ పోలీసును కత్తితో దాడి చేసేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే ఢిల్లీలో ఎప్పుడూ రద్దీగా వుండే రోడ్డుపై కారు డ్రైవర్‌కు, సర్దార్ జీ ఆటో డ్రైవర్‌కు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారాన్ని సద్దుమణిగించేందుకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
దీనిపై సర్దార్ జీ డ్రైవర్ వద్ద విచారిస్తుండగానే ఆయన వున్నట్టుండి.. కత్తితో పోలీసుపై దాడి చేయబోయాడు. ఆవేశంలో అక్కడున్న నలుగురు పోలీసులపై రాజుల కాలం నాటి కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే స్థానికులు అతనిని పట్టుకున్నారు.
కానీ పోలీసులు మాత్రం ఆ కత్తిని చూసి జడుసుకుని వెనక్కి తగ్గారు. కానీ ఓ స్థానికుడు మాత్రం ధైర్యం చేసి ఆ డ్రైవర్‌ను కట్టడి చేయడం వీడియోలో కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.