Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్.. ఆ పార్టీలోకి వెళ్ళిపోతా... జనసేనానికి ఆ ఎమ్మెల్యే వేడుకోలు...?

సర్.. ఆ పార్టీలోకి వెళ్ళిపోతా... జనసేనానికి ఆ ఎమ్మెల్యే వేడుకోలు...?
, సోమవారం, 17 జూన్ 2019 (14:25 IST)
ఎన్నికలకు ముందు జనసేన పార్టీతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకానొకదశలో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ప్రచారం బాగానే జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా జనసేనపార్టీని ప్రజల్లోకి బాగానే తీసుకెళ్ళారు. క్యాస్ట్ తో సంబంధం లేదంటూ ఎపిలో దాదాపుగా అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. కానీ ఫలితాల్లో మాత్రం బొక్కబోర్లాపడ్డారు.
 
జనసేన పార్టీ నుంచి తూర్పుగోదావరిజిల్లా రాజోలుకు చెందిన రాపాక వరప్రసాద్ మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో నుంచి పోటీ చేసి ఓడిపోతే గెలుపొందింది ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే. మొదట్లో ఏ పార్టీలోకి వెళ్ళనని చెబుతూ వచ్చిన రాపాక వరప్రసాద్ ఆ తరువాత తన నియోజకవర్గాన్ని అభివ్రుద్థి చేసుకోవాలి కాబట్టి తాను అధికార వైసిపిలోకి వెళ్ళిపోవడానికి సిద్థమయ్యాడు. 
 
కానీ వరప్రసాద్ కు అక్కడ తలుపులు తెరుచుకోలేదు. ఎవరూ ఆయన్ను ఆహ్వానించలేదు. దీంతో స్థానిక పార్టీ కన్నా నేరుగా జాతీయపార్టీలోకి వెళ్ళిపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట. అది కూడా బిజెపిలోకి. ఇప్పటికే బిజెపికి చెందిన కొంతమంది నేతలతో ఆయనలో టచ్ లో ఉన్నారట. ఈ విషయం జనసేనానికి తెలిసింది. కానీ ఆయన మొదట్లో అడగలేదు. పార్టీ అధినేతకు ఆలస్యంగానైనా రాపాక వరప్రసాద్ చెప్పి వేడుకున్నారట.
 
సర్. నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి కదా. నాపై ప్రజలు నమ్మకం ఉంచారు కదా. అందుకే నేను బిజెపిలోకి వెళ్ళాలనుకుంటున్నా. మీరు దయచేసి ఒప్పుకోండి అంటూ వేడుకొన్నారట. అయితే జనసేనాని మాత్రం పెండింగ్‌లో పెట్టారట. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కాస్తా వెళ్ళిపోతే ఇక ఏం చేయాలోనన్న ఆలోచనలో పడ్డారట పవన్ కళ్యాణ్. మరి చూడాలి... పవన్ కళ్యాణ్ ఆదేశాలను విని సైలెంట్‌గా రాపాక వరప్రసాద్ ఉండిపోతారో లేకుంటే పార్టీ వదిలి వెళ్ళిపోతారో.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ గెలుపు.... పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ : అమిత్ షా