ఆంధ్రప్రదేశ్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సహా అంతా ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. సభ్యులంతా ప్రమాణం చేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ఛాంబర్‌కి వెళ్లారు. ఆ తర్వాత కొందరు సభ్యులు వెళ్లి ఆయనను విష్ చేసి వచ్చారు.
వీరిలో జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వున్నారు. ఆయన జగన్ మోహన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. ఐతే జనసేన నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే కావడంతో ఆయన ఎక్కడికి వెళ్లినా వార్తల్లోకి వచ్చేస్తుంది. మీరు జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు కలిశారంటూ ఆయనను విలేకరులు ప్రశ్నించారు.
తను ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు రాపాక. కాగా రాపాకకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఓ మాట చెప్పారట. అదేంటయా అంటే... ప్రమాణ స్వీకారం పూర్తవ్వగానే మన పార్టీ తరపున ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు చెప్పి రండి అని అన్నారట. ఆ ప్రకారం రాపాక సీఎంను కలిసి విషెస్ చెప్పి వచ్చారని అంటున్నారు.