Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగాతో ఆరోగ్యవంతమైన జీవనం... రాష్ట్ర భాషా, సాంస్కృతిక సంఘ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్

అమరావతి: యోగాతో మానసిక ఒత్తిళ్ల నుంచి ఉద్యోగులకు ఎంతో ఉపశమనం కలిగి, ఆరోగ్యవంతమైన జీవనం లభిస్తుందని రాష్ర్ట భాషా, సాంస్కృతిక సంఘం కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ అన్నారు. సోమవారం సచివాలయంలోని రెండో బ్లాక్ లో అయిదు రోజుల పాటే సాగే సూక్ష్మ యోగా, మెడిటే

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (20:51 IST)
అమరావతి: యోగాతో మానసిక ఒత్తిళ్ల నుంచి ఉద్యోగులకు ఎంతో ఉపశమనం కలిగి, ఆరోగ్యవంతమైన జీవనం లభిస్తుందని రాష్ర్ట భాషా, సాంస్కృతిక సంఘం కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ అన్నారు. సోమవారం సచివాలయంలోని రెండో బ్లాక్ లో అయిదు రోజుల పాటే సాగే సూక్ష్మ యోగా, మెడిటేషన్ వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో పని ఒత్తిళ్లతో పాటు పలు రకాల సమస్యలతో మనిషి తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారన్నారు. దీనివల్ల వ్యాధుల గురై అకాల మరణాల భారినడపతున్నారు. 
 
యోగా చేయడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండడమే కాకుండా, మానసిక ప్రశాంతత కలిగి ఆరోగ్యవంతమైన జీవనం లభిస్తుందన్నారు. అయిదు రోజుల పాటే యోగా వర్క్ షాప్ లో ఉద్యోగులు పాల్గొని, ఆరోగ్యకరమైన జీవితం పొందాలని రాష్ర్ట భాషా, సాంస్కృతిక సంఘం కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సూచించారు. 
 
సూక్ష్మ యోగా, మెడిటేషన్ వర్క్ షాప్ నిర్వాహకురాలు సునీతమ్మ మాట్లాడుతూ, యోగా వల్ల ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయం కలుతుందన్నారు. మనిషిని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్య అనే ఆరు దుర్గణాలు నాశనం చేస్తున్నాయన్నారు. యోగా సాధనతో వాటికి దూరంగా ఉండే వీలుందన్నారు. గంట పాటు సాగిన యోగా తరగతుల్లో రాష్ర్ట భాషా, సాంస్కృతిక సంఘం కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments