Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు కాలి నడకన వెళుతున్నారా? జాగ్రత్త దొంగలు వెనకే వస్తున్నారు

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (22:44 IST)
తిరుమల నడకదారిలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. అలిపిరి నడకదారిలో కర్నూలుకు చెందిన భక్తులపై దొంగలు దోపిడీకి యత్నించారు. భక్తులు ప్రతిఘటించడంతో దొంగలు పారిపోయారు. 
 
నిన్న సాయంత్రం చీకటి పడే సమయానికి అలిపిరి మార్గం నుంచి కర్నూలుకు చెందిన భక్త బృందం తిరుమలకు బయలుదేరింది. చిన్నపిల్లలతో పాటు మొత్తం 9 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. 
 
నడిచి వస్తుండగా సరిగ్గా నడకదారికి సగభాగంలో నలుగురు యువకులు కనిపించారు. వారు వీరి వెనుకలే వస్తూ టార్చ్ లైట్ వారి ముఖంపై వేస్తూ హేళనగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తరువాత చిన్నపిల్లల మెడలో ఉన్న బంగారు చైన్లను లాక్కునేందుకు ప్రయత్నించారు.
 
దీంతో భక్తబృందంలోని ముగ్గురు మగవారు దొంగలతో ప్రతిఘటించడంతో పాటు వారితో పాటు ఉన్న వారు గట్టిగా కేకలు వేయడంతో దగ్గరలో నడిచివస్తున్న కొంతమంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. భక్త బృందం ఎక్కువగా వస్తుండడాన్ని గమనించిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
 
అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. అయితే మోకాళ్ళ మిట్ట వద్దకు వెళ్ళిన తరువాత టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే మొబైల్ వ్యాన్‌లో ఘటనా స్థలి వద్దకు వెళ్ళారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments