ఎర్రచందనం దుంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు. తిరుపతి సమీపంలోని పెరుమాళ్లపల్లి వద్ద ఎస్వీ నగర్ స్మశానం వద్ద వాహనంలోకి లోడ్ చేస్తున్న 49 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. గురువారం నుంచి ఎస్వీ జూ పార్క్ వెనుక వైపు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు చేపట్టిన సిబ్బందికి.. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఎస్వీ నగర్ స్మశానం ప్రాంతంలో స్మగ్లర్లు కొందరు క్యారియర్ వాహనంలో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తూ కనిపించారు.
పోలీసు సిబ్బంది వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా దుంగలను వదిలి పారిపోయారు. సంక్రాంతి సందర్భంగా తమిళ స్మగ్లర్లు పనులకు వెళ్లకుండా ఇంటి దగ్గర కుటుంబాలతో గడపడం వారి ఆనవాయితీ అని పోలీసులు తెలిపారు. అయితే కరోనా కారణంగా సంపాదన లేక పండుగలలో కూడా సంపాదనకు వచ్చినట్లు భావిస్తున్నామని అన్నారు.
దుంగలు దాదాపు ఒకటిన్నర టన్ను ఉంటుందని, కోటి రూపాయలపైన విలువ ఉంటుందని తెలిపారు. స్మగ్లర్లు దుంగలను లోడ్ చేసి తిరిగి అడవుల్లోకి వెళ్లేందుకు నిత్యావసర వస్తువులు సమకూర్చుకున్నారని అన్నారు. ఇందులో ఐదు మూటలు బియ్యం, ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపారు.
పండుగ సమయంలో కూడా విధి నిర్వహణ లో పాల్గొని, భారీగా ఎర్రచందనం దుంగలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. సంఘటన స్థలానికి డీఎఫ్ ఓ హిమ శైలజ చేరుకుని, ఎర్రచందనం దుంగలు ఏ ప్రాంతం నుంచి తీసుకుని వచ్చారనే అంశంపై విచారించారు.