Webdunia - Bharat's app for daily news and videos

Install App

16న శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో 'గో మహోత్సవం'

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (18:14 IST)
తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీన గో మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మకర సంక్రాంతి పర్వదినం అనంత‌రం కనుమ సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. 
 
భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. కనుమ పండుగ రోజు పశువులను అలంకరించి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. 
 
కనుమ పండుగ సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6.00 గంటల నుండి వేణుగానం ప్రారంభమవుతుంది. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తారు. 
 
8.00 గంటల నుండి 10.30 గంటల వరకు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన మరియు కోలాటాలు, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌తో సంకీర్త‌న  కార్య‌క్ర‌మాలు  నిర్వహిస్తారు. 
 
ఉద‌యం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహించనున్నారు. అనంత‌రం టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో సంక్రాంతి హ‌రిదాసులు, డు..డు..బ‌స‌వ‌న్న నృత్యం ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. 
 
ఉద‌యం 11.45 గంటల నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరికీ సపోర్ట్ చేయరని తేల్చి చెప్పిన దిల్ రాజు

"గేమ్ ఛేంజర్" టీజర్‌ను ఏయే థియేటర్లలో రిలీజ్ చేస్తారు?

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments