ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్దికి రూ.500 కోట్లతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించకుంటే ఆగస్టు 16వ తేదీన తెనాలి మార్కెట్ సెంటర్లో ఆమరణ నిరాహారదీక్షకు దిగనున్నట్టు కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్, మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, దర్శకుడు దిలీప్‌రాజా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు లక్షల 27 వేల కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్ ప్రవేశపెడితే అందులో సినిమా పరిశ్రమకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమని విమర్శించారు. చిన్న సినిమాలను కనీసం వారంలో రెండు రోజులు ప్రదర్శించేట్టు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం ఐదుగురు నిర్మాతల చేతుల్లో సినిమా థియేటర్లు ఉండటం హేయమైన చర్య అని, దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టిసారించాలని కోరారు.