Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళాశాలకు వెళ్లి అదృశ్యమైన యువతి.. ఇసుక రీచ్ వద్ద శవమై కనిపించింది...

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (09:42 IST)
కడప జిల్లాలో దారుణం జరిగింది. కళాశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని ఆదివారం ఉదయం శవమై కనిపించింది. జిల్లాలోని జంగాలపల్లె ఇసుక రీచ్ వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సకాలంలో స్పందించలేదని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. 
 
పోలీసుల కథనం మేరకు... జిల్లాలోని బి.కొండూరు మండలం, మరాటిపల్లెకు చెందిన అల్లంపాటి రామిరెడ్డి, రమాదేవిల రెండో కుమార్తె అనూష (19) బద్వేల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. 
 
ఈ నెల 20వ తేదీన కాలేజీకి వెళ్లిన ఆ యువతి రాత్రికి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో అనూష మృతదేహం ఇసుక రీచ్ ఉన్న అనుమానాస్పద స్థితిలో కనిపించింది. 
 
ఈ యువతిపై సామూహిత అత్యాచారం చేసి చంపి నదిలో విసిరేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ వాదనలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు. ఆ యువతి అదృశ్యమైన రోజునే ఆత్మహత్య చేసుకుందని మైదుకూరు డీఎస్పీ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో చెప్పడం గమనార్హం. 
 
ఈ వ్యాఖ్యలను మృతురాలి తల్లిదండ్రులు కొట్టిపారేస్తున్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని 20వ తేదీ రాత్రి బద్వేలు పట్టణ పోలీసుల దృష్టికి తీసుకెళ్తే అది తమ పరిధి కాదని వెనక్కి పంపించారని, దీంతో తాము బి కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసి విషయం చెబితే బద్వేలులో అదృశ్యమైంది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. 
 
అప్పటికీ స్థానిక పోలీసులు తమ మాట వినకపోవడంతో వారు మైదుకూరు డీఎస్పీని ఆశ్రయించగా, అపుడు కేసు నమోదైంది. తమ కుమార్తె మృతికి పాపిరెడ్డిపల్లికి చెందిన గురుమహేశ్వర రెడ్డి అనే యువకుడిపై తమకు అనుమానం ఉందని పోలీసులకు చెప్పామని, వారు వెంటనే స్పందించివుంటే తమ కుమార్తె ప్రాణాలతో మిగిలివుండేదని తల్లిదండ్రులు బోరున విలపిస్తూ చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments